సహనశీలం | భేతాళ కథలు | Tales of Vikram and Betala | Sahanasheelam

writer
0

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, అకుంఠిత దీక్షతో శ్రమ పడుతూన్న నీ పట్టుదల మెచ్చతగి నదే. కాని, తీరా ఫలితం అందుకునే సమయంలో చంచల చిత్తుడివై ఎలా ప్రవర్తిస్తావో ఏమోనన్న అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే కొందరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుం టారో తెలియదు. నీకు తగు హెచ్చరికగా ఉండగలందులకు చపల చితులైన కోయ యువతీయువకుల కథ చెబు తాను, శ్రమ తెలియకుండా, విను, అంటూ ఇలా చెప్పసాగాడు:


దండకారణ్యం తూర్పుదిశలో మార్తాండమనే కోయగూడెం ఉండేది. సాహస ప్రియులైన ఆ కోయగూడెం యువతీ యువకులు ఒకనాటి సాయం కాలం ఆట పాటలలో తేలియాడి, ఒక తటాకం ఒడ్డున కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అందమైన ఆ తటాకంలోని చేపలు ఎగిరెగిరి పడుతూండడం చూడడా నికి ఆహ్లాదకరంగా ఉన్నది.


"గాలిలోకి ఎగిరి పడుతూన్న చేపపిల్లను గురిచూసి బాణంతో ఎవరైనా కొట్టగలరా?" అంటూ సవాలు విసిరాడు ఆ బృందంలోని ఒక యువకుడు. י


"నీటి నుంచి ఎగిరే చేపపిల్ల గాలిలో ఉండేది లిప్తకాలమే. గురి చూడ్డానికి కూడా ఆ సమయం చాలదు. దానిపై బాణ ప్రయోగం అసాధ్యం!" అన్నాడు ఇంకొక యువకుడు తల అడ్డంగా ఊపుతూ.


అవును, నిజం. అది సాధ్యం కానిపని, అన్నాడు మరొక యువకుడు.


"పట్టుదలతో ప్రయత్నిస్తే, అసాధ్యమే సుసాధ్యమవుతుంది," అన్నాడు మొదటి యువకుడు.


ఆ మాట విన్న తరవాత ఊరుకోలేక ముగ్గురు యువకులు ప్రయత్నించారు కాని, కొట్టడం వారికి సాధ్యంకాలేదు.


ఆ బృందంలో నెలవంక అనే అందాల యువతి ఉన్నది. ఆమె అందచందాలకు ముగ్ధులుకాని యువకులు ఆ గూడెంలో లేరు. ఆమెకు ప్రతాపుడంటే చాలా ఇష్టం. ప్రతాపుడు చక్కని దేహదారుఢ్యంతో చిరుత పులిలా చురుకైన వాడు. నెలవంక అతడి విలువిద్యాపాటవాన్ని పరీక్షించాలనుకుని, "ఎగిరి పడే చేపపిల్లను కొడితే, నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను," అన్నది చిన్నగా నవ్వుతూ.


ప్రతాపుడు ఉప్పొంగిన హృదయంతో లేచి చాలా ఏకాగ్రతతో గురిచూసి బాణం వదిలాడు. ఎక్కడో చిన్న తప్పిదం జరగడంతో చేపపిల్లకు వెంట్రుకవాసిలో బాణం దూసుకు పోయింది. ప్రతాపుడు ఆశాభంగానికి లోన య్యాడు.


దానిని చూడగానే అతనికి కొద్ది దూరంలో మిత్రుడితో కలిసి కూర్చున్న వీరమల్లు అనే యువకుడిలో ఉత్సాహం పెల్లుబికింది. వాడికి నెలవంక అంటే మహా ఇష్టం. ఆమెను పెళ్ళాడ డానికి ఇదొక గొప్ప అవకాశంగా భావించాడు. పట్టుదలతో బాణం ఎక్కుపెట్టి, శక్తినంతా బాణంపై కేంద్రీకరించి, చేపపిల్ల వాలే దిశగా వదిలాడు. అంతే, బాణం మెరుపు వేగంతో వెళ్ళి చేపపిల్లను తాకింది! అక్కడ ఉన్న వారందరూ చప్పట్లు కొట్టి అతణ్ణి మెచ్చుకు న్నారు. వీరమల్లు గర్వంతో పొంగిపోతూ, "అందాలరాణీ, నువ్వు విసిరిన సవాలులో గెలుపొందాను కదా? నీ మాట ప్రకారం మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం?” అని అడి గాడు నెలవంకను చూస్తూ.


ఆ మాటకు ఉలిక్కిపడిన నెలవంక కోపా వేశంతో, “నేను నిన్ను వివాహం చేసుకోవ డమా? కలలో కూడా అది జరగదు. సవా లులో గెలుపొందితే, ప్రతాపుణ్ణి పెళ్ళాడు తానని చెప్పానే తప్ప, సవాలులో ఎవడు గెలిస్తే వాణ్ణి పెళ్ళాడతాననలేదు,” అన్నది.


"ఏమిటీ ప్రతాపుణ్ణి మాత్రమే పెళ్ళాడ తానన్నావా? మరి వాడి పేరు చెప్పలేదే. గెలిస్తే నిన్ను పెళ్ళాడతానన్నావు. ఇప్పుడు నేను గెలిచాను. నన్ను పెళ్ళాడడానికి అభ్యంతరం దేనికి? గూడెంలో ప్రతాపుడికి ఒక న్యాయం, నాకొక న్యాయమా?” అంటూ అడ్డదిడ్డంగా వితండవాదానికి దిగాడు వీరమల్లు.


"అవును. గూడెంలో అందరికీ ఒకే న్యాయం ఉండాలి. నెలవంక వీరమల్లును మనువాడ వలసిందే,” అంటూ జంబీరుడనే యువ కుడు వీరమల్లుకు మద్దతుగా నిలిచాడు.


“వివాహ విషయంలో అందరికీ ఒకే న్యాయం వర్తించదు. నచ్చిన వాణ్ణి కోరుకో మంటే తెలివిగలపిల్ల దుర్మార్గుణ్ణి కోరుకుం టుందా? ఇది నా పెళ్ళి; నా ఇష్ట ప్రకారమే


జరుగుతుంది. అడగడానికి నువ్వెవడివి?" అన్నది నెలవంక ఆవేశంతో.


"అదంతా నాకు తెలియదు. నువ్వు పెళ్ళి చేసుకోగలవన్న ఆశతోనే నేను నీ సవాలును స్వీకరించాను. ఇప్పుడు కాకపోతే, మరెప్పు డైనా ఎలాగైనా నిన్నే నేను పెళ్ళాడి తీరు తాను," అని ప్రతిజ్ఞ చేశాడు వీరమల్లు.


ఇలాంటి తగాదాలు అరుదుగా తలెత్తిన ప్పటికీ, మార్తాండ జాతిలో ఐకమత్యం ఎక్కువ. మంచివాడు-చెడ్డవాడు, బలవం తుడు బలహీనుడు అన్న భేదాలు పాటించ కుండా ఎవరైనా ప్రాణాపాయంలో వుంటే చూసిన వాడు తన ప్రాణాలనైనా పణంగా పెట్టి కాపాడడం వాళ్ళ సంప్రదాయం. ఒకనాడు వీరమల్లు తేనెను సేకరిస్తూ నిటారు బండల మధ్య చిక్కుకు పోయాడు. వాడు కింద పడిపోయే ప్రమాదాన్ని, ఆ దారిగుండా వచ్చిన ప్రతాపుడు చూసి, వాణ్ణి కాపాడాడు. ప్రతా పుడు ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ వీరమల్లుతో, 'నెలవంక నిన్ను వివాహమాడ డంలో నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అయితే, మంచితనంతో ఆమె మనసును దోచుకోవడానికి ప్రయత్నించు," అన్నాడు.


“అవన్నీ నాకు తెలుసు. నువ్వేం చెప్పనవ సరం లేదు,” అంటూ వీరమల్లు అక్కణ్ణించి విసురుగా వెళ్ళిపోయాడు.


కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు వేట ముగించి, భోజనం చేసి తీరిగ్గా కూర్చుని ఏవో మాట్లాడుకుంటూన్న యువతీయువకులు మీదికి హఠాత్తుగా నాలుగు పులులు వచ్చి పడ్డాయి. ఊహించని ఈ పరిణామంతో యువతీయువకులు చెల్లాచెదరయ్యారు.


పరిగెత్తుతూ, నెలవంకను పులి పంజాదెబ్బ నుంచి వీరమల్లు ఒడుపుగా కాపాడాడు. యాదృచ్ఛికంగా ఇద్దరూ ఇరుకైన లోయలోకి జారిపోయారు. నెలవంకకు మోచేయి గీసుకుపోయి నెత్తురు కారసాగింది. ఎత్తు నుంచి కిందికి పడడంతో ఆమెస్పృహకోల్పో యింది. ఆమె ముఖం మీద నీళ్ళు చల్లి స్పృహ తెప్పించడానికి వీరమల్లు దాపులనున్న కొలను కేసి పరిగెత్తాడు.


పైనుంచి ఆ దృశ్యాన్ని చూసిన అతడి మిత్రుడు జంబీరుడు, "మిత్రమా, అదృష్టం అంటే నీదే. వెంటనే నీకుడి చేతికి గాయం చేసుకుని, నీ రక్తాన్ని నెలవంక మోచేతి నుంచి కారే రక్తంతో కలిపెయ్. ఆ తంతుతో మీ ఇద్దరికీ పెళ్ళయినట్టే లెక్క. త్వరగా కానియ్. నేను వెళ్ళి మీకు పెళ్ళయిపోయిం దని మన గూడెంలో అందరికీ చెబుతాను, ' అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 


జంబీరుడి ప్రచారం విని ప్రతాపుడూ, అతడి మిత్రులూ ఆశ్చర్యపోయారు. వీర మల్లు నెలవంకను బలవంతంగా పెళ్ళాడివుం టాడని కులపెద్దకు ఫిర్యాదు చేశారు. చండ శాసనుడైన కులపెద్ద రచ్చబండవద్ద సమావేశం ఏర్పాటు చేసి, "బిడ్డా, నెలవంకా! మన సంప్ర దాయం ప్రకారం వధువు మొదట వరుడి కుడిచేతిని చురకత్తితో గాయపరచి నెత్తురు చిందిస్తే, వరుడు ఆమె ఎడమ చేతిపై నెత్తురు గాయంచేసి, ఇరువురి నెత్తురూ కలిసే విధంగా చేతులు పెనవేసుకోవాలి. మీ చేతు లకు గాయాలయితే కనిపిస్తున్నాయి. పెళ్ళి నీ సమ్మతంతో జరిగిందా? వీరమల్లు నిన్ను బలవంతంగా పెళ్ళాడివుంటే చెప్పు. వాడి కనుగుడ్లు పెకలించి గద్దలకు ఆహారంగా వేస్తాను. శుద్ధి కార్యక్రమం జరిపించి నీకు ఇష్ట మైన వాడితో వివాహం జరిపిస్తాను” అన్నాడు.


నెలవంక నిదానంగా ఆలోచించి, "వీర మల్లుతో నాకు జరిగిన వివాహాన్ని నేను మన స్ఫూర్తిగానే అంగీకరిస్తున్నాను. నా వివాహం కారణంగా, గూడెంలో ఐకమత్యం చెక్కు చెదరకూడదు,” అన్నది.


వీరమల్లు ఆ మాట విని ఒక అడుగు ముందుకువేసి, “లేదు దొరా, లేదు. అసలు మా వివాహమే జరగలేదు. నా మిత్రుడి మాటవిని అవకాశం దొరికింది కదా అని నా చేతిని గాయపరుచుకుని పెళ్ళితంతు జరిపిం చేయాలని ఉబలాటపడ్డ మాట వాస్తవం.


అయితే, స్పృహతప్పి పడివున్న నెలవంకను సమీపించి, నిర్మలమైన నిండు చందమామ లాంటి ఆమె ముఖం చూసి ఆ పని చేయ లేకపోయాను. నేను ఇప్పుడే గూడెంవదిలి నా మిత్రుడితో సహా వెళ్ళిపోతున్నాను," అంటూ అక్కడినుంచి బయలుదేరాడు.


గూడెంపెద్ద ఇరువురినీ మెచ్చుకోలుగా చూశాడు.


బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, అటు నెలవంకా, ఇటు వీరమల్లూ అంత అసం బద్దంగా ఎందుకు ప్రవర్తించారు? చండ శాసనుడైన కులపెద్ద సమక్షంలో తనకు ఇష్టం లేని పెళ్ళి జరిగిపోయిందని ఒక్క మాట చెప్పివుంటే నెలవంకకు కోరిన యువకుడు భర్త అయ్యేవాడు కదా? ఆ అవకాశాన్ని జార విడిచి, తొలినుంచీ నిరసిస్తూ, అసహ్యించుకుంటూన్న వీరమల్లును మనస్ఫూర్తిగా పెళ్ళా డానని ఎందుకు అబద్దం చెప్పింది? మొదట నెలవంకను ఎలాగైనా పెళ్ళాడి తీరుతానని ప్రతిజ్ఞ చేసిన వీరమల్లు, ఆఖరికి ఆమె తాను స్వయంగా అంగీకరించినప్పటికీ, అసలు పెళ్ళేకాలేదని చెప్పి గూడెం వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ సందేహాలకు సమా ధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలి పోతుంది," అన్నాడు.


దానికి విక్రమార్కుడు, “తమకు పెళ్ళి జరిగిపోయిందని అందరూ అనుకుంటు న్నారే తప్ప, తను స్పృహకోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు జరిగిన దేమిటో నెలవంకకు తెలియదు. ఆమె వీరమల్లును మనస్ఫూర్తిగా వివాహమాడానని చెప్పడానికి కారణం- తోటి వారికి ప్రాణాపాయం అంటే తమ ప్రాణం అడ్డు వేసి కాపాడాలనే వారి జాతి దొడ్డగుణం, సంప్రదాయం ఆమె రక్తంలో జీర్ణించుకు పోవడం. తనకు ఇష్టం లేని పెళ్ళి జరిగిందన్నా, అసలు జరిగిందేమిటో తనకు తెలియదని చెప్పినా వీరమల్లుకు కఠిన శిక్ష తప్పదు. పులిబారి నుంచి తనను కాపాడిన వీరమల్లు


శిక్షకు గురికావడం ఆమెకు ఇష్టంలేదు. అందువల్లే, తాను ఇష్టపడి పెళ్ళిచేసుకున్నా నని అబద్ధం చెప్పింది. ఇక వీరమల్లు జరిగిన నిజాన్ని మాత్రమే చెప్పాడు. అతడికి నెలవంక మీద అమిత అభిమానం ఉన్న మాట నిజమే. కాని జాతి సంప్రదాయానికి విరుద్ధంగా, బలవంతగా ఆమెను పెళ్ళాడడం అతడి అభి మతం కాదు. ఇంత జరిగిన తరవాత తాను అక్కడే ఉంటే తన ప్రమేయం లేకున్నా, తన అనుచరుల కారణంగా గూడెం ప్రజల ఐక మత్యానికి భంగం వాటిల్లగలదన్న అనుమానం తోనే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరూ కూడా సహనశీలంతో గూడెం ప్రజల ఐకమత్యాన్ని ప్రాణప్రదంగా భావించి అలా ప్రవర్తించారే తప్ప, అందులో ఎలాంటి అసంబద్ధతా లేదు. దానిని గ్రహించడం వల్లే గూడెం పెద్ద కూడా వాళ్ళను మెచ్చుకోలుగా చూశాడు, అన్నాడు.


రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు. 

(కల్పిత కథ)







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)