పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు,“రాజా, ఒక దేశాన్నేలే రాజుగా నువ్వు ఎందరో మహాపండి తుల్నీ, శాస్త్ర జ్ఞానంలో నిధులైన వారినీ ఎరిగివుంటావు. ఐతే, వారిలో ఏ ఇద్దరూ ఏది ధర్మం, ఏది జ్ఞానం అన్న విషయాల్లో ఏకీభవించడం చాలా అరుదు. అలాంటి సందర్భా లలో రాజులు, ఎక్కువ వాదనా పటిమ వున్న వాడి అభిప్రాయాల తోనో, లేక తన ఆలోచనా సరళికి అనుకూ లంగా మాట్లాడిన వాడితోనో ఏకీభవించి రాచ కార్యాలు నిర్వహించచూస్తారు. ఇందువల్ల రాజ్యంలో ఒక్కొక్కసారి అనర్హులూ, విచక్షణా జ్ఞానహీనులూ ప్రముఖులయి, పరిపాలనా వ్యవస్థ కుంటుపడే ప్రమాదం వున్నది. ఇందుకు ఉదాహరణగా విశ్వనాధుడనే పండి తుడీ, నయసాగరుడనే రాజుకథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను," అంటూ ఇలా చెప్పసాగాడు:
పూర్వం భువనగిరి అనే రాజ్యంలో, విశ్వ నాధుడనే పండితుడు, ఒక గురుకులంనడు పుతూండేవాడు. దూరప్రాంతాలనుంచి విద్యా ర్థులు అక్కడికి వచ్చి విద్య నభ్య సించేవారు. ఆయన తర్కవ్యాకరణ శాస్త్రాల్లో సాటిలేని మహాపండితుడని చెప్పుకునేవారు.
ఒకనాడు, ఆయన శిష్యులకు తర్క శాస్త్రం బోధిస్తూండగా, రాజునయసాగరుడు పంపిన దూత వచ్చి, లేఖ ఒకటి ఆయనకు ఇచ్చాడు. అందులో విశ్వనాధుణ్ణి రాజధానికి రావలసిందిగా రాజు పంపిన ఆహ్వాన పత్రం వున్నది. మర్నాడు, విశ్వనాధుడు, కనకశర్మ అనే శిష్యుణ్ణి వెంటబెట్టుకుని, సాయంకాలా నికి కాశీపురం అనే గ్రామం చేరి, రాత్రికి ఒక సత్రంలో విడిదిచేశాడు. ఆ సమయంలో సత్రంలోచెప్పుకుంటున్న విశేషాలువిని, ఆశ్చర్య పోతూగురువుకు విన్నవించాడు, కనక శర్మ,
మర్నాడు, సూర్యోదయంతోనే గురుశిష్యులు గ్రామం వెలుపల వున్న చెరువు దగ్గరకు వెళ్ళారు. ఆ రోజు శ్రావణ పూర్ణిమ. అప్పటికే అక్కడ జనంగుంపులు గూడి వున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ నాడు హఠయోగి విమలానంద స్వామి సూర్యోదయకాలంలో దర్శన మిస్తాడు. అందరి దృష్టి చెరువు మధ్యలో వున్న చిన్న ఇసుకదిబ్బ పైనే వున్నది.
స్వామి విమలానందుడు హ ఠాత్తుగా, ఇసుకదిబ్బ పక్కనున్న నీళ్ళలో నుంచి పైకి లేచాడు. భక్తులకోలాహలం మిన్నుముట్టింది. భక్తి పారవశ్యంతో స్వామికి జేజేలు పలికారు.
విమలానందుడు నీళ్ళ మీద నడుచు కుంటూ తీరం వైపు రాసాగాడు. ఆయన నేలపై నడిచినట్టుగానే, నీటిమీద నడిచివచ్చి, చెరువుగట్టుపైన ఆలయం ముందున్న వేదిక మీదికి ఎక్కికూర్చున్నాడు. విమలానందుడు ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే నీటి పైకి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఆ హఠయోగి దర్శనంతో, తన జన్మ తరించినట్టు కనకశర్మ ఉప్పొంగిపోయాడు.
ఆ తరవాత, గురుశిష్యులిద్దరూ బయలు దేరి, అరణ్యమార్గాన పయనించి, సూర్యా స్తమయ సమయాన ఒక ముని ఆశ్రమం చేరారు. ఆశ్రమం శరభంగుడనే మహాతప స్విది. ఆశ్రమం ముందు హోమగుండాలు నిర్విరామంగా ప్రకాశిస్తున్నవి. మరుసటి రోజు సూర్యోదయ వేళలో ముని హోమ గుండంలో ప్రవేశిస్తాడని, ఆయన శిష్యులు చెప్పారు. అందువల్ల ఆ రాత్రంతా హోమ గుండాలు ప్రజ్వరిల్లుతూనే వుంటాయి.
సూర్యోదయం వేళ, మంత్రద్రష్ట అయిన ఆ మహాముని, అగ్నిహోత్రాన్ని ప్రజ్వరిల్ల జేసి, అగ్నిప్రవేశం చేశాడు. ఆశ్రమవాసులు భయాందోళనలతో చూడసాగారు. అరగంట తరవాత ముని అగ్నికుండం నుంచి మేలిమి బంగారు ఛాయలో ధగధగ మెరిసిపోతూ బయటికి వచ్చాడు.
ఆశ్రమవాసులూ, ఈ అద్భుత దృశ్యాన్ని చూడవచ్చిన భక్తులూ హర్షధ్వానాలు చేశారు. మునిచేతులెత్తి, వారందరినీ ఒకసారిదీవించి, ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు. కనకశర్మ పరమానందభరితుడై, తన జీవితం ధన్యమై నట్టు భావించాడు.
మరుసటిరోజున విశ్వనాధుడూ, కనక శర్మా అక్కడినుంచి బయలుదేరి కొండలూ, గుట్టల మార్గం గుండా ప్రయాణం చేసి, మధ్యాహ్నం వేళకు రాయదుర్గం అనే గ్రామం చేరారు. అంతంత మాత్రంగా పంటలు పండే ఆమెట్ట ప్రాంతం, ఆ సంవత్సరం వర్షాలు లేక కరువు కాటకాలతో అల్లాడిపోతున్నది. తాగేం దుకు నీరు కూడా దొరకక ప్రజలు ఆకలి చావులకు గురవుతున్నారు.
రాయదుర్గ గ్రామంలో, రమేశుడనే రైతు యువకుడొకడున్నాడు. వాడు తన గ్రామ యువకులనే కాక, కరువు ప్రాంతాలవున్న యువకుల్ని కూడా సమీకరించి, పంటలు సమృద్ధిగా వున్న ప్రాంతాలనుంచీ, సమీప పట్టణాలనుంచీ దాతల ద్వారా తిండి గింజలు సేకరించి, గంజి కేంద్రాలు స్థాపించి అన్నారు లను ఆదుకుంటున్నాడు.
గురుశిష్యులిద్దరూ గ్రామం చేరాక, వాళ్ళ ఎదుట దయనీయమైన సంఘటన ఒకటి జరిగింది. చేతికర్రసాయంతో, దూర ప్రాంతం నుంచి గంజికేంద్రానికి వచ్చిన ఒక వృద్ధు రాలు, రమేశుడు గంజివున్న పాత్రతో వచ్చే లోపలే, ఆకలిని భరించలేక కుడితి తొట్టెలో వున్న బియ్యంకడుగును దోసిలితో తాగి స్పహ తప్పిపడిపోయింది.
రమేశుడామెను పొదివి పట్టుకుని గంజి తాగించాలని చూశాడు. కాని, అప్పటికే ఆ వృద్ధురాలు ప్రాణాలుకోల్పోయింది.
ఈ దుర్ఘటన రమేశుడికి కళ్ళనీళ్ళు తెప్పిం చింది. చుట్టూ వున్న ప్రజలు మరణించిన వృద్ధురాలికేసి చూస్తూబాధతో తలలు వంచు కున్నారు.
కొద్దిదూరంలో నిలబడి, ఈ జరిగినదంతా చూసిన విశ్వనాధుడు, రమేశుణ్ణి సమీపించి, “మీరు ఇక్కడి కరువు పరిస్థితులు ఎంత భయానకంగా వున్నదో వివరిస్తూ, మహారాజు నుంచి సహాయం కోరితే ఎంతో బావుండేది గదా!” అన్నాడు.
రమేశుడు, విశ్వనాధుడికి నమస్కరించి, “స్వామీ, సహాయంకోసం రాజుగారిని అర్థిం చడం జరిగింది. కాని, మాకెలాంటి సహాయమూ అందలేదు. ఇంత పెద్ద రాజ్యంలో, ఏదో ఒక ప్రాంతాన కరువు కాటకాలన్నవి అసహజమేం కాదనుకుని వుంటాడాయన!" అన్నాడు.
రమేశుడి మాటల్లోని వ్యంగ్య విమర్శను గుర్తించిన విశ్వనాధుడు, మరేం మాట్లాడ కుండా, అక్కడినుంచి కదిలి రాజధానికి చేరాడు.
రాజధానిలో, విశ్వనాధుడికి, రాజు నయ సాగరుడు ఘనంగా స్వాగత సత్కారాలు జరిపాడు.తరవాత, పురప్రముఖులతో సభ ఏర్పాటు చేయబడింది. సభలో విశ్వనాధుడు తన ప్రయాణంలో చూసిన ముఖ్య సంఘట నలను రాజుకు వివరించాడు.
అంతా శ్రద్ధగా విన్నరాజు, “మన రాజ్యంలో ఎందరో మహోన్నత వ్యక్తులున్నట్టు కనబడు తున్నది. రాజోద్యోగుల ద్వారా, ఇతరత్రా నేను సేకరించిన మరికొందరి పేర్లు తమకు యిస్తు న్నాను,” అంటూ, విశ్వనాధుడికి కొన్ని పత్రాలు ఇచ్చి, “ఒక మారు తమరు ఇవన్నీ కూడా నిశి తంగా పరీక్షించి, ఈ సంవత్సరం మనం ఇవ్వ దలచిన ప్రతిష్ఠాత్మకమైన మహోన్నత వ్యక్తిని నిర్ణయించండి!' అన్నాడు.
విశ్వనాధుడు, రాజు ఇచ్చిన పత్రాలన్నీ చదివి, “మహారాజా!కరువుకాటకాలతో తల్ల డిల్లుతున్న రాయదుర్గం ప్రాంతాలకు, ఆహార ధాన్యాలను తక్షణం తరలించండి. దానితో పాటు అవసరమైన ఇతర సహాయ సహకారా లను కూడా అందించండి. ఈ సంవత్సరం మన రాజ్యంలో మహోన్నత వ్యక్తిగా, రాయ దుర్గం వాడైన రమేశుణ్ణి నిర్ణయిస్తున్నాను!' అన్నాడు. "
బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, ప్రజలు చెప్పుకుంటున్నట్టు, రాజు నయసాగరుడు విశ్వసిస్తున్నట్టు, ఈ విశ్వనాధుడు తర్క వ్యాకరణాల్లో మహాపండితుడా, లేక వితండ వాద శిరోమణా అన్న అనుమానం కలుగు తున్నది. హఠయోగి విమలా నందస్వామి నిండు సంవత్సరం పాటు నీటి అడుగున వుండి, తరవాత పైకిలేచి, నీటిమీద నడవడం ఆయన చూశాడు. అలాగే, మహోజ్వలంగా మంటలు వెదజల్లుతున్న హోమగుండంలో దిగి, అరగంట తరవాత మేలిమి బంగారు ఛాయతో బయటికి వచ్చిన, మహా మంత్ర ద్రష్ట శరభంగమునిని చూశాడు. అయినా అంత మహోన్నతులను కాదని, విశ్వనాధుడు కరువు కాటకాల్లో చిక్కిన ప్రజలకు గంజి కేంద్రాలునడిపే సామాన్య రైతు యువకుడైన రమేశుణ్ణి, మహోన్నతుడుగా నిర్ణయించ డాన్ని ఏమనాలి? ఈ సందేహాలకు సమా ధానం తెలిసికూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది," అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “విమలానంద స్వామి హఠయోగి. ఎంతోకాలం సాధనచేసి జలస్తంభన విద్య సాధించాడు. ఏడాది కొక సారి నీటిపైకి వచ్చి, తనవిద్యను ప్రదర్శించి భక్తుల చేత పొగడ్తలు పొందుతున్నాడు. ఇందువల్ల అతడికి మహదానందం కలగ వచ్చు. కాని, ప్రజలకు జరిగిన మేలేమిటి? ముని శరభంగుడు మంత్రశాస్త్రంలో నిధి కావచ్చు. అందువల్ల, ఆయన మంటల్లో అరగంట కాలం గడిపి సజీవంగా బయటికి రాగలుగుతున్నాడు. ఇది ఆయనకు ఆత్మ తృప్తి నివ్వవచ్చు. అయితే, ఈ ప్రదర్శనవల్ల ప్రజలకు రవ్వంతయినా మేలు జరుగు తున్నదా? రమేశుడు యోగి, మునుల్లా తమ తమ స్వార్థచింతనా, కీర్తిప్రతిష్ఠల్లో మునిగి తేలక, కరువుకాటకాల్లో మలమలమాడు తూన్న ప్రజలకు చేతనైనంతలో సహాయం చేస్తూ ఆదుకుంటున్నాడు. ఆకారణంవల్లనే విశ్వ నాధుడు అతణ్ణి మహోన్నతుడుగా నిర్ణ యించాడు,” అన్నాడు.
రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.
(కల్పిత కథ)