ముమ్మిడివరం అనే గ్రామంలో భట్టుమూర్తి అనే వేదపండితుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు తులసమ్మ. భట్టుమూర్తి నాలుగు వేదాలు, అష్టాదశ పురాణాలు జోపాసనపట్టిన మహామేధావి. ఆ దేశాన్ని పాలించే రాజుగారు సైతం భట్టుమూర్తిని గౌరవించేవారు. అనేక సార్లు భట్టుమూర్తికి రాజుగారు సన్మానాలు చేసారు.
దాంతో భట్టుమూర్తికి డబ్బు, బంగారం విపరీతంగా పోగుపడింది. భట్టుమూర్తి దంపతులకి అన్నీ పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకున్న ఏకైక లోటు సంతానం లేదు.
ఆ దంపతులు పిల్లలు కలగాలని ఎందరో దేవుళ్ళకి మొక్కుకున్నారు. పుణ్యక్షేత్రాలు తిరిగారు. కానీ ఫలితం శూన్యం. ఒక రోజు భట్టుమూర్తి ఆ ఊరి అమ్మవారి గుడిలో రామాయణం పురాణం చెపుతుండగా, ఒక ఆయన వద్దకు వచ్చి ఇలా అడిగింది.
"అయ్యా పంతులుగారు! పిల్లలు లేని దశరథుడు ఏదో యాగం చేస్తే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుట్టారని విన్నాను. ఆ యాగం పేరు ఏమిటో చెపుతారా?” ఆ ఆగంతకురాలు అడిగిన ప్రశ్నకు భట్టుమూర్తి ఉలిక్కి పడ్డాడు. కారణం తనకే పిల్లలు లేరు. తను కూడా ఏదైనా యాగం చేస్తే పిల్లలు పుడతారేమో... అన్న ఆలోచనలో ఉన్నాడు.
అయితే ఏ యాగం చెయ్యాలి అన్న విషయం అతనికి స్పష్టంకాలేదు. తన మనస్సులోకి సందేహాన్ని ఆ స్త్రీ అడగటం వలన ఆయన కలవర పడ్డాడు. ఆయన ఆలోచన నుండి తేరుకొని సమాధానం చెప్పాలనుకుని చూసే సరికి. ఇందాక ప్రశ్న అడిగిన స్త్రీ కనబడలేదు. అప్పుడు అర్థమయింది భట్టుమూర్తికి ఆ స్త్రీ అమ్మవారేనని- ఆ ఆలయంలో పురాణా కాలక్షేపం పూర్తి కాగానే అందరూ ఇళ్ళకీ వెళ్ళిపోయారు. భట్టుమూర్తి కూడా ఇంటికి చేరుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళేసరికి, ఆయన భార్య తులసమ్మ మంచి నిద్రలో ఉన్నది.
భట్టుమూర్తి భార్యను లేపకుండా, ఆరు బయట వేసి ఉన్న పట్టి మంచంపై పడుకున్నాడు. ఎండాకాలం కావటం వలన చల్లగాలికి వెంటనే నిద్రపట్టింది ఆయనకు.
ఆ రాత్రి నిద్రలో ఎవరో చెప్పినట్లుగా విని పించింది. పిల్లలు కలగాలంటే చేయాల్సిన యాగం పేరు.
అది పుత్రకామేష్టి యాగం. అంతటి పండితుడు అయిన భట్టుమూర్తికి కాలం కలిసివచ్చేదాకా ఏ యాగం చెయ్యాలన్న విషయం తట్టక పోవటం సహజమే.
మర్నాడు ఉదయం భార్యతో చెప్పాడు. మనం త్వరలో పుత్రకామేష్టి యాగం చేద్దాం. ఖచ్చితంగా నీకు సంతానం కల్గుతుంది. భర్త మాటలకి, పిల్లలు పుట్టినంత సంతోషం కల్గింది తులసమ్మకు. అనుకున్న ప్రకారమే ఆ దంపతులు సమస్త బంధువుల్ని పిలిచి ముమ్మిడివరంలోని వాళ్ళ గృహంలో పుత్రకామేష్టి యాగం చేసారు.
ఆ రోజు రాత్రి భట్టుమూర్తికి, ఒక దేవతారుపుడు స్వప్నంలో కనిపించి, త్వరలో నీ భార్య గర్భవతికాగలదు. నీకు పండంటి మగ బిడ్డ జన్మిస్తాడు అని ఆశీర్వదించాడు. భట్టుమూర్తి తెల్లరినాకా భార్యను పిలిచి, తన కొచ్చిన స్వప్నం గురించి చెప్పాడు.
తులసమ్మ చాలా ఆనందించింది. సరిగ్గా సంవత్సరం తిరిగే సరికి భట్టుమూర్తి దంపతులకి బంగారంగా మెరిసిపోయే ఒక సర్పం జన్మించింది. మనిషికి సర్పం పుట్టింది అన్న వార్త విన్న జనాలు భట్టుమూర్తి ఇంటికి తండొప, తండాలుగా వచ్చి, భట్టుమూర్తి సంతానంగా జన్మించిన నాగుపాముని చూసి వెళ్ళసాగారు.
ఇంతలో భట్టుమూర్తికి సంబంధించిన బంధువులు కూడా వచ్చి ఆ బిడ్డను చూసి, కంగారు పడ్డారు.
పాము ప్రమాదకారి, కనుక వెంటనే ఆ నాగ శిశువుని ఎటన్నా దూరంగా తీసుకెళ్ళి వదిలేసి రమ్మని సలహా ఇచ్చారు. కానీ భట్టుమూర్తి భార్య మాత్రం తనుకు పుట్టినది పాము అయినసరే అలాగే పెంచుకుంటానని పట్టుబట్టింది.
భట్టుమూర్తి నీళ్ళు నమిలాడు. బంధువులనీ కాదనలేదు. భార్యను సమాధాన పరచలేడు. చివరికి తులసమ్మ మాటే నెగ్గింది. ఆ సర్పాన్ని పెంచుకొటానికే నిర్ణయం జరిగింది.
ఇలా సంవత్సరాలు గడిచాయి. భట్టుమూర్తి సంతనం అయిన సర్పానికి 18 సంవత్సరాలు నిండాయి. భట్టుమూర్తి ఏనాడు, తన కుమారుడిగా పుట్టిన సర్పాన్ని కనీసం ముట్టుకొవాటం కూడా జరగలేదు. ఆ సర్ప కుమారుడిని తులసమ్మే గుండెలపై పెట్టుకొని సాకీ, 18 ఏళ్ళు పెంచింది.
ఒక రోజు తులసమ్మ భర్తను సమీపించి, ఏమండి మన బిడ్డకు పెళ్ళీడు వచ్చింది. పెళ్ళి చెద్దాం అన్నది. భార్య మాటలకి భట్టుమూర్తి గతుక్కుమన్నాడు. ఏమేవ్! పాముకి ఎవరైనా పిల్లను ఇస్తారా? నీ పిచ్చిగాని అన్నాడు బాధగా.
భర్త మాటల్ని ఖతరు చెయ్యకుండా, తులసమ్మ తన కుమారుడికి పెళ్ళి చేసి తీరాలని పట్టుపట్టింది. సరే భార్యను బాధపెట్టటం ఇష్టం లేక, కోడలి కోసం అన్వేషణ ప్రారంభించాడు భట్టుమూర్తి. ఆయన వెంటనే ప్రయాణం మొదలు పెట్టాడు.
మొదటిగా సింహపురి గ్రామంలో ఉంటున్న తన స్నేహితుడు శేషాద్రిని కలిసి, తన కుమారుడికి పెళ్ళి చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు. తన కుమారుడు 'పాము' అని పొరపాటున కూడా మిత్రుడికి చెప్పలేదు భట్టుమూర్తి.
ఆయన మాట విన్న శేషాద్రి తన కుమార్తె నీలాంబరిని భట్టుమూర్తి కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఇంకేం కోడలు దొరికింది.
ఆ రోజుల్లో కన్యాశుల్కం అనే ఆచారం ఉండేది. కన్యాశుల్కం అంటే, పెళ్ళికూతురి తల్లి, దండ్రులకు కొంత ధనాన్ని చెల్లించి, పెళ్ళికూతురిని స్వగృహానికి తీసుకు వెళ్ళి తమ కుమారుడికి ఇచ్చి పెళ్ళి చేసేవారు పెళ్ళి కుమారుడి తల్లి దండ్రులు.
అందువల్ల భట్టుమూర్తి కూడా భారీగా కన్యాశుల్కం చెల్లించి, మిత్రుడి కుమార్తె నీలాంబరిని తీసుకొని ముమ్మిడివరం గ్రామం చేరాడు. కాబోయే కోడల్ని చూసి, తులసమ్మ బాగా ఆనందపడింది. ఓనుమరి కోడలు చక్కని చుక్క, సుగుణాల రాశి అయితే ఏ అత్తగారికి ఆనందంగా ఉండదు. సరే ఒక మంచి ముహూర్తం నిర్ణయించబడింది.
ఇది ఇలా ఉండగా, ఆ ఊరిలోని అమ్మలక్కలు భట్టుమూర్తి కాబోయే కోడల్ని కలిసి, పెళ్ళి కొడుకు మనిషి కాదని పాము అనీ, ఆ పెళ్ళి చేసుకొవద్దనీ సలహాలు చెప్పారు.
కానీ పెళ్ళి కూతురు నీలాంబరి ఇలా అన్నది. మా తండ్రిగారు, భట్టుమూర్తిగారికి పిల్లనిస్తానని వాగ్దానం చేసారు. కనుక ఏం జరిగినా సరే భట్టుమూర్తి గారి సర్ప పుత్రుడిని పెళ్ళాడి తీరతానని. సరే నిర్ణయించిన ముహూర్తానికే భట్టుమూర్తిగారి నాగ పుత్రుడికి, నీలాంబరికి వివాహం ఘనంగా జరిగింది. మనిషికి, సర్పానికి జరిగిన ఈ విచిత్ర వివాహం చూడాటానికి వేలాది జనం తరలి వచ్చారు.
వివాహం అయింది. నీలాంబరి ఒక ఆడదైన ధర్మపత్నిలాగానే భర్త అయిన సర్పానికి అన్ని రకాల సేవలు చేసేది. కోడలు రావటం వలన తులసమ్మకి కొడుకు బాధ్యత తగ్గి విశ్రాంతి దొరికింది. ఇలా రోజులు గడుస్తున్నాయి.
నీలాంబరి కళ్ళముందే క్రింద పడక గదిలో తల్పం మీద ఉన్న పాము శరీరంలోకి ప్రవేశించి అదృశ్యం అయ్యాడు ఆ యువకుడు. దీనికి నీలాంబరి చాలా సంతోషించింది. ఆ మర్నాడు ఉదయం ఈ విషయాన్ని అత్త, మామలకు తెల్పింది.
ఒక నాటి పౌర్ణమిరాత్రి సర్పము క్రింది పడక గదిలోని నిద్రిస్తుందగా నీలాంబరి ఒంటిరిగా మేడ పైకి వెళ్ళింది. చల్లని వెలుగులు చిందిస్తున్న చంద్రుడిని చూసి మైమరచి పోయింది ఆమె. ఇంతలో ఎవరో మేడ మెట్లు ఎక్కి పైకి వస్తున్న శబ్దం వినపడి ఎవరా అని తల తిప్పి చూసింది నీలాంబరి.
ఒక అందాల యువకుడు కనిపించాడు. అతడు ఎవరో నీలాంబరికి అర్థం కాలేదు. అతడు నేరుగా నీలాంబరి దగ్గరికి వచ్చి కౌగిలించుకోవాలని ప్రయత్నించగా నీలంబరి అతన్ని దూరంగా త్రోసివేసి, ఆగ్రహంగా ఇలా అన్నది.
ఓరీ పాపాత్ముడా ఎవరు నీవు, నన్ను తాకాలని చూస్తున్నావు? జాగ్రత్త. ఆమె ఆగ్రహాన్ని చూసిన ఆ యువకుడు చిరునవ్వులు చిందిస్తూ, ఓయీ నీలాంబరి నేను ఎవరనుకుంటున్నావు. నేను నిన్ను ధర్మశాస్త్రపరంగా పెళ్ళాడిన నాగ కుమారుడిని అన్నాడు.
కానీ నీలాంబరి, ఆ యువకుడి మాటల్ని నమ్మలేనట్టు చూసింది. అప్పుడు ఆ యువకుడు చెప్పటం ప్రారంభించాడు. దేవీ, నేను శాప కారణంగా ఇలా సర్ప రూపంలో జన్మించాను.
ఎవరైనా ఇష్టపూర్వకంగా నన్ను వివాహమాడితే, వివాహం జరిగిన సంవత్సరానికి మనిషి రూపం పొందగలను. అయితే రాత్రిళ్ళు మాత్రమే మనిషి రూపం. పగలు సర్పంగానే ఉంటాను అన్నాడు.
వాళ్ళు ఈ సంగతిని విని మహా ఆనందించారు. ఒక రోజు రాత్రి నీలాంబరి, యువకుడు మేడపై వెన్నెలలో వివరిస్తుండగా, భట్టుమూర్తి హఠాత్తుగా కుమారుడి పడక గదిలో ప్రవేశించి, కుమారుడి తల్పంపై ఉన్న సర్ప దేహాన్ని చూసి, ఆహా! నేను కనుక ఈ పాము శరీరాన్ని దహనం చేసినట్టు అయినచో నా కుమారుడు తప్పకుండా మానవ దేహంలోనే ఉండి తీరాతాడు అనుకున్నాడు.
వెంటనే ఆ పాము శరీరాన్ని ఇంటికి దూరంగా తీసుకెళ్ళి, మంట తయారు చేసి ఆ మంటల్లో ఆ పాము దేహాన్ని వేసి దహనం చేసి ఇంటికి వచ్చాడు. మేడపై నుండి క్రిందికి వచ్చిన భట్టుమూర్తి కుమారుడికి తన సర్ప దేహం కనిపించక ఏమైది అది అని తల్లి, దండ్రుల్ని అడిగాడు. అప్పుడు భట్టుమూర్తి కుమారా! శాపవ శాత్తు నీకు కల్గిన సర్ప శరీరాన్ని నేను దహనం చేసాను.
కావున నీవు ఇకపై ఈ మనవ రూపంలోనే ఉండవచ్చు అన్నాడు. తండ్రి మాటలకు ఆనందించిన యువకుడు, తండ్రీ, మీరు నా సర్పదేహాన్ని మంటల్లో వేసి మంచి పని చేసారు.
నాకు ఇవ్వబడ్డ శాపంలో పరిహారం ప్రకారం, ఎవరైనా నా సర్ప దేహాన్ని నాకు తెలియకుండా దహనం చేసినట్లు అయిన నాకు ఇకా ఏనాటికీ సర్పరూపం రాదు అన్నాడు. దాంతో భట్టుమూర్తి ఆంనందగా కుమారుడిని కౌగిలించుకున్నాడు.
తులసమ్మ కన్నీళ్ళు, చెక్కిళ్ళపై దొర్లుతుండగా, కొడుకు, కోడల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నది. తనకి సర్ప రూపంలో బిడ్డ జన్మించినా మాతృపాశానికి రూపంతో పని లేదు అని పామును బిడ్డగా పెంచిన తులసమ్మ నిజంగా మతృదేవత.
నీతి : రూపం శాశ్వతం కాదు.