భీష్మ ప్రతిజ్ఞ | మహాభారతం | Bhishma's Promise | Mahabharatham | Ep-04

writer
0

దుష్యంతుడి అనంతరం భరతుడు రాజై, కణ్వమహామునిని పురోహితుడుగా పెట్టు కుని మహా వైభవంగా రాజ్యపాలన చేశాడు. భరతుడి మునిమనమడు హస్తి అనేవాడు. ఇతని పేరనే హస్తినాపురం ఏర్పడింది. ఆ హస్తికి అయిదోతరం వాడు కురువు అతని పేరనే కురుక్షేత్రం ప్రసిద్ధమయింది. కురుడికి ఏడోతరం వాడు ప్రతీపుడు. ఇతని భార్య శిబి కూతురైన సునంద. వీరిద్దరికీ దేవాపీ, శంతనుడూ, బాహ్లికుడూ అనే ముగ్గురు కొడుకులు కలిగారు. వారిలో పెద్ద వాడైన దేవాపి తపస్సు చేసుకుంటానని వెళ్ళి పోవటం చేత శంతనుడు రాజయాడు.


ఒకనాడు శంతనుడు అరణ్యంలో వేటాడి గంగాతీరాన విశ్రాంతి తీసుకుంటూండగా అక్కడ అతని కొక చక్కని స్త్రీ కనిపించింది. ఆమె రూపలావణ్యాలు చూస్తే శంతనుడికి దేవకాంత అనిపించింది. ఆమె కూడా శంతనుణ్ణి చూసి ఆకర్షించ బడిన దానిలాగా అతన్ని రెప్ప వేయకుండా చూడసాగింది. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి మోహం ఏర్పడ్డట్టు గ్రహించి శంతనుడు ఆమెను పలకరించి, "సుందరి, నువ్వె వరు? ఒంటరిగా ఈగంగాతీరాన ఎందుకు తిరుగుతున్నావు?" అని అడిగాడు.


"నీకు నన్ను పెళ్ళాడాలని మనసయి నట్టయితే నా కేమీ అభ్యంతరం లేదు. కాని ఒక్క నియమం ఉన్నది: నేను చేసే పను లకు అభ్యంతరం చెప్పినా, నన్ను నిందిం చినా, నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను,” అన్నది ఆ స్త్రీ. అందుకు సమ్మతించి శంతను డామెను భార్యగా  పరిగ్రహించాడు.


వారి దాంపత్యంలో ఆమెకు వరసగా మగపిల్లలు కలుగుతూ వచ్చారు. పుట్టిన పిల్లలను పుట్టినట్టే ఆమె గంగలో పడేస్తూ వచ్చింది. ఇది శంతనుడికి చాలా బాధ కలిగించింది. కాని తాను ఇందుకు అభ్యం తరం చెబితే ఆమె తనను విడిచి పోతుందని భయపడి, ఏడుగురు కొడుకులను గంగ పాలు కానిచ్చాడు.


కాని ఆమె ఎనిమిదవసారి మళ్ళీ కొడు కును కన్నప్పుడు, ఆ బిడ్డను చావనివ్వటం ఇష్టం లేక ఆమెను తూలనాడుతూ, "పుట్టిన కొడుకు లందరినీ గంగలో వేశావు గదా. ఏ ఆడదైనా ఇలా సొంత బిడ్డలను చేతులారా చంపుకుంటుందా ? ఇకనైనా ఈ పుట్టిన వాణ్ణి బతికి ఉండనీ. ఇంతకూ నువ్వెవరు? బిడ్డలందరినీ ఎందు కలా చంపుతున్నావు?” అని అడిగాడు శంతనుడు.


" నీకు కొడుకు కావాలని ఉంటే వీణ్ణి చంపకుండా నీ కిస్తాను. నాకు అడ్డు చెప్పావు గనక నేనిక నిన్ను విడిచి వెళ్ళి పోతాను. నేనెవరిననీ, నా పిల్లలను ఎందుకు చంపాననీ అడిగావు. చెబుతాను విను. నేను గంగను. వసిష్ఠుడు అష్టవసువు లను మనుషులుగా పుట్టమని శపించగా, వారు నన్నూ, నిన్నూ తల్లిదండ్రులుగా కోరుకున్నారు. వారి కోసమే నేను స్త్రీరూపం ధరించి ఇన్నాళ్ళూ నీకు భార్యగా ఉన్నాను. నా గర్భాన పుట్టిన వసువులను త్వరలోనే వారి లోకానికి పంపగలందులకు, పుట్టగానే చంపేస్తూ వచ్చాను. నీకు కొడుకు లేకుండా పోతాడేమో నని వీణ్ణి బతకనిస్తున్నాను,” అన్నది గంగ.


అయితే గంగ ఆ కొడుకును శంతనుడి కివ్వక, వాడితో సహా అంతర్ధాన మయింది. భార్యాపుత్రు లిద్దరినీ పోగొట్టుకున్న విచా రంతో శంతనుడు హస్తినాపురానికి తిరిగివచ్చాడు. కొంత కాలం గడిచింది. ఒకనాడు అతను వేటాడుతూ గంగా తీరానికి వచ్చి, గంగా ప్రవాహం చాలా సన్ననిపాయగా ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఒక యువకుడు బాణాలు వేసి గంగా ప్రవాహా నికి ఆనకట్ట కడుతూండటం శంతనుడి కంటపడింది. 


అప్పుడు గంగ తన పూర్వ రూపంలో శంతనుడి ముందు కనబడి, ఆ కుర్రవాణ్ణి చూపి, " వీడు నీ ఎనిమిదో కొడుకు. ఇంత కాలమూ నేను వీణ్ణి పెంచి పెద్దచేశాను. వీడు వసిష్ఠుడి వద్ద వేదవేదాంగాలు నేర్చు కున్నాడు, పరశరాముడి వద్ద ధనుర్విద్య నేర్చుకున్నాడు. వీడి పేరు దేవవ్రతుడు. ఇక నువు వీణ్ణి తీసుకుపో,” అన్నది.


శంతనుడు దేవవ్రతుణ్ణి తన వెంట హస్తినాపురానికి తీసుకుపోయి, యువ రాజును చేసి చాలా సంతోషించాడు.


నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఒక నాడు శంతనుడు యమునాతీరానికి విహ రించబోయాడు. అక్కడ అతనికి అపూర్వ మైన సువాసన తగిలింది. ఆ వాసన వచ్చిన దిక్కుగా వెళ్ళి, ఒక అపురూప సుందరి శరీరం నుంచి ఆ సుగంధం వస్తున్నట్టు తెలుసుకుని, శంతను డామెను పలకరించి, "నువ్వెవరు? ఎవరి కూతురువు?” అని అడిగాడు.


"నేను దాశరాజు కూతుర్ని. నా పేరు మత్స్యగంధి. నన్ను యోజనగంధి అని కూడా పిలుస్తారు. నా తండ్రి ఆజ్ఞాపించగా నే నిక్కడ తప్ప నడుపుతూ, మనుషులను నది దాటిస్తాను,” అన్న దామె.


వెంటనే శంతనుడు దాశరా జున్న చోటికి వెళ్ళి, " నీ కూతుర్ని నా కిచ్చి పెళ్లి చెయ్యి,” అని అడిగాడు,


"నీ వంటి అల్లుడు దొరికితే అంతకన్న నా కేం కావాలి? అయితే, నా కూతురుకి పుట్టబోయే కొడుకు నీ అనంతరం రాజయేటట్టుంటే నా కూతురి నిచ్చి నీకు చేస్తాను," అన్నాడు దాశరాజు.


దేవవ్రతుడు అదివరకే యువరాజై ఉండగా ముందు పుట్టబోయేవాడు తన అనంతరం రాజు కావటం పొసగదు. అందు చేత శంతనుడు దాశరాజు చెప్పినదానికి ఒప్పుకోక ఇంటికి తిరిగి వచ్చి, మత్స్య గంధిని పెళ్ళాడలేక పోయినందుకు పుట్టెడు విచారంలో మునిగిపోయాడు.


దేవవ్రతుడు తండ్రి విచారం గమనించి కారణ మడిగాడు. శంతనుడు దాశరాజు కూతురు మాట చెప్పాడు. వెంటనే దేవ వ్రతుడు పెద్ద పరివారాన్ని వెంటబెట్టుకుని దాశరాజు వద్దకు వెళ్ళి, "నా తండ్రికి నీ కుమార్తెను భార్యగా ఇయ్యి” ఇయ్యి," అని అడిగాడు.


దానికి దాశరాజు, "బాబూ,. ఈ పిల్ల ఉపరిచర వసువు కూతురు. ఈ పిల్లను ఆయన నా కిస్తూ, దీనిని తగిన వరుడి కిచ్చి చెయ్యమన్నాడు. దీని పేరు సత్యవతి. అసితుడైన దేవలుడు పెళ్ళాడతా నన్నప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. నీ తండ్రి చేసు కుంటానంటే తప్పక ఇస్తాను. కాని నాకు ఒక టే భయం. నువు చూడబోతే మహా యోధుడివి, వీరాగ్రేసరుడివి. సత్యవతికి పుట్టబోయే వాడు నీ ముందు ప్రాణాలతో నిలవటం కల్ల. ఆ భయంతోనే వెనకాడు తున్నాను,” అన్నాడు.


అప్పుడు దేవవ్రతుడు దాశరాజుతో, అలా అయితే నా ప్రతిజ్ఞ విను. నాకు నా తండ్రి రాజ్యం అక్కర్లేదు. సత్యవతికి పుట్టబోయే వాడే అందరితోబాటు నాకూ రాజుగా ఉంటాడు. అందరి ఎదటా నేనీ శపథం చేస్తున్నాను,” అన్నాడు.


దాశరాజు దేవవ్రతుడితో, "ఇలాటి ప్రతిజ్ఞ అందరూ చెయ్యగలరా? నువు రాజ్యత్యాగం చేసినా నీ సంతతి ఊరుకో వద్దా?" అన్నాడు.


కాలక్రమాన విచిత్రవీర్యుడికి వివాహ యోగ్యమైన వయసు వచ్చింది. అదే సమ యంలో కాశీరాజు తన కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం జరుపు తున్నానని చాటింపు వేశాడు. ఈ సంగతి తెలిసి భీష్ముడు సత్యవతితో చెప్పి, రథం మీద కాశీనగరానికి బయలుదేరి వెళ్ళాడు. స్వయంవరానికి అనేకమంది వచ్చి స్వయం వర మందిరంలో చేరారు. భీష్ముడు కూడా అక్కడికి చేరాడు. కాశీరాజు కుమార్తెలకు వచ్చిన వారి వివరాలు చెబుతున్నాడు. భీష్ముడు, "నేనీ కన్యలను నా తమ్ముడి కిచ్చి చెయ్యటానికి తీసుకుపోతున్నాను,” అని ప్రకటించి, అంబనూ, అంబికనూ, అంబాలికనూ తన రథంలోకి ఎక్కించు కుని, అక్కడ చేరిన రాజులతో, "ఈ కన్య లను విడిపించటానికి శక్తిగలవారు నాతో యుద్ధం చేసి నన్ను జయించండి," అని సవాలు చేశాడు.


అందరూ యుద్ధసన్నద్ధులై ఒక్కసారిగా అతని పైకి వచ్చారు. భీష్ముడు అంత మంది నుంచీ తనను రక్షించుకోవటమే గాక, కొందరిని చంపి, కొందరిని గాయ పరిచి భీభత్సం కలిగించి, కాశీరాజు కూతు ళ్ళతో సహా హస్తినాపురానికి బయలు దేరాడు. అందరూ ఓడిపోయాక సాళ్వుడు అతన్ని ఎదిరించి, ప్రాణాలతో తప్పిం చుకు పోయాడు.


హస్తినాపురం చేరగానే భీష్ముడు సత్య వతితో సంప్రతించి, కాశీరాజు కుమా ర్తెలను ముగ్గురినీ విచిత్రవీర్యుడి కిచ్చి పెళ్ళి చేయ నిశ్చయించాడు.


ఆప్పుడు వారిలో పెద్దదైన అంబ, "నేను అదివరకే సాళ్వుణ్ణి వరించాను. అతను కూడా నాపై ప్రేమగా ఉన్నాడు. స్వయం. వరం సక్రమంగా జరిగినట్టయితే నేనతన్ని వరించి ఉండే దాన్ని. నన్ను అసహాయు రాలిని చేసి తీసుకు వచ్చావు. ఇప్పటికైనా నా కోరిక చెల్లించటం నీకు ధర్మం," అని భీష్ముడితో అన్నది.


భీష్ముడు మంత్రులతోనూ, పురోహితుల తోనూ, బంధువర్గంతోనూ ఆలోచించి, వారు అనుమతించగా అంబను సాళ్వుడి వద్దకు పంపేసి, అంబికనూ, అంబాలికనూ విచిత్ర వీర్యుడి కిచ్చి పెళ్ళి చేశాడు.


అంబికనూ, అంబాలికనూ పెళ్ళి చేసు కున్నాక విచిత్రవీర్యుడు బొత్తిగా స్త్రీలోలు డైపోయి, రాజ్యకార్యాలను విడిచిపుచ్చి, తన భార్యలతోనే కాలం గడపసాగాడు. అతనికి కాలక్రమాన క్షయవ్యాధి సంప్రా ప్తమై, దానితోనే అతను మరణించాడు. భీష్ముడు మరొకసారి తన తమ్ముడికి ఉత్తరక్రియలు చేసి, పుత్రశోకంతో విల పించే సత్యవతిని ఓదార్చాడు,


కొంతకాలమయాక సత్యవతి భీష్ముడితో, "నాయనా, మీ తండ్రి వంశాన్ని నిలబెట్ట టానికీ, ఆయనకు పిండాలు వెయ్యటానికీ నువు ఒక్కడివే మిగిలావు. ఆపద్ధర్మంగా, అంబికా అంబాలికల యందు నువు సంతా సంకను. అది సమ్మతం కాకపోతే తగిన కన్యను పెళ్ళాడి వంశంనిలబెట్టు,” అన్నది.


భీష్ముడిందుకు సమ్మతించలేదు. "నేను చేసిన ప్రతిజ్ఞ తప్పను. ఇంద్రపదవి ఇస్తా మన్నా నా నిర్ణయం మారదు. నువు ఆప ధర్మమని చెప్పేది అక్షరాలా అధర్మం. ఇంకొక ఆపద్ధర్మం ఉన్నది. దాన్నయినా పెద్దలనూ, ఆప్తులనూ, మంత్రులనూ విచా రించి మరీ అమలుచెయ్యాలి. ఆ ఆపద్ధర్మ మేమిటంటే, వంశం నిలబెట్టటానికి నీ కోడళ్ళు ఉత్తమ బ్రాహ్మణులద్వారా సంతానం పొందవచ్చు. పూర్వం పరశు రాముడు ప్రపంచంలోని క్షత్రియులందరినీ చంపినప్పుడు, చనిపోయినవారి భార్యలు బ్రాహ్మణోత్తముల ద్వారా సంతానం పొంది క్షత్రియవంశాలు నిలబెట్టారు. మనంకూడా అలాగే చేయవచ్చు.” అన్నాడతను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)